Header Banner

స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేసిన పాక్! సీన్ రివర్స్!

  Mon May 19, 2025 13:43        India

పహల్గామ్ లో పర్యాటకులపైన ఉగ్రవాదులు విరుచుకుపడి మరణ హోమం సృష్టించి 26 మంది ప్రాణాలు తీసిన ఘటన తర్వాత మోడీ సర్కార్ ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులను అణిచివేయడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక ఆపరేషన్ సిందూర్ ను జీర్ణించుకోలేక పోయిన పాకిస్తాన్, మన దేశం పైన దాడి చేయడానికి డ్రోన్లను, క్షిపణులను ఉపయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి కూడా తెలిసిందే.

 

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం టార్గెట్

పాకిస్తాన్ మన దేశంపైన దాడికి చేసిన అన్ని ప్రయత్నాలను భారత భద్రత దళాలు తిప్పికొట్టిన విషయం ప్రతి ఒక్కరికి విధితమే. అయితే ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్ సర్ లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు.

 

పాక్ దాడుల యత్నాన్ని తిప్పికొట్టిన భారత్

పాక్ దాడుల యత్నాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టామని కూడా ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ తెగబడుతుందని భారత సైన్యం ముందే అంచనా వేసింది. మిలట్రీ ని టార్గెట్ చేయడంతో పాటుగా పౌరులకు సంబంధించిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాల పైన టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించారు.

 

ఇది కూడా చదవండిశ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

గోల్డెన్ టెంపుల్ టార్గెట్.. అదనపు భద్రత కల్పించిన ఆర్మీ

పాకిస్తాన్ కు ఎటువంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని, ఎక్కడ సాధ్యమైతే అక్కడ విధ్వంసం సృష్టించి భారత పౌరులకు నష్టం చేసే ప్లాన్ చేసిందని భావించారు. ఇక ఈ క్రమంలోనే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ ను టార్గెట్ చేసిందని గుర్తించారు. ఈ క్రమంలో గోల్డెన్ టెంపుల్ కు ఎటువంటి హాని జరగకుండా అదనపు రక్షణ కల్పించినట్టు గా, గోల్డెన్ టెంపుల్ రక్షించడం కోసం పూర్తిగా సిద్ధమైనట్లుగా ఆయన పేర్కొన్నారు.

 

స్వర్ణ దేవాలయంపై చిన్న గీత కూడా పడకుండా రక్షణ మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పి కొట్టిందని మేజర్ జనరల్ వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ , క్షిపణులను ఎక్కడికక్కడ ధ్వంసం చేశామని స్వర్ణ దేవాలయం పైన ఒక గీత కూడా పడకుండా కాపాడగలిగాము అని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #GoldenTemple #Amritsar #IndiaSecurity #PakistanTerror #TempleTargeted #ReligiousSiteAttack